Surfingall

Get Go Entertain Enjoy Energy

Sports

Posted by surfingall on April 3, 2010

ఆయేషాదే తప్పు!

పలువురు పాక్ క్రీడాకారుల అభిప్రాయంషోయబ్‌కు సంఘీభావం

April 7th, 2010

కరాచీ, ఏప్రిల్ 6: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఈనెల 15న వివాహం చేసుకుంటానని ప్రకటించి చిక్కుల్లో పడిన పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు పలువురు బాసటగా నిలుస్తున్నారు.

అబద్ధాలు చెప్పాను..మోసం చేశాను..

టైగర్ ఉడ్స్ అంగీకారం

April 7th, 2010

అగస్టా, ఏప్రిల్ 6: తాను జీవితంలో ఎన్నో అబద్ధాలు చెప్పానని, చాలా మందిని మోసం చేశానని ప్రపంచ మేటి గోల్ఫర్ టైగర్ ఉడ్స్ అంగీకరించాడు.

మెగా టెన్నిస్ ఈవెంట్‌కు

బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా?

April 7th, 2010

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: పాకిస్తాన్ క్రికెట్ షోయబ్ మాలిక్‌ను ఈనెల 15న వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించి, ఆతర్వాత తలెత్తిన పరిణామాలతో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సతమతమవుతున్నప్పటికీ, ఆమెనే ఒక మెగా ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐడిఎ) భావిస్తోంది. ఈనెల 16న ముంబయిలో జరిగే సుమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. మన దేశంలో అగ్రశ్రేణి టెన్నిస్ స్టార్‌గా సానియా పేరుప్రఖ్యాతులు సంపాదించిందని, అందుకే, ఈఏడాది తాము నిర్వహించబోయే మెగా ఈవెంట్‌కు ఆమెనే బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని యోచిస్తున్నట్టు ఎఐటిఎ తన ప్రకటనలో వివరించింది. సానియాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని పేర్కొంది.

రోడిక్‌కు టైటిల్

సోనీ ఎరిక్‌సన్ టెన్నిస్ టోర్నమెంట్

April 6th, 2010

కీబిస్కెన్, ఏప్రిల్ 5: ప్రతిష్ఠాత్మక సోనీ ఎరిక్‌సన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అమెరికా ఆటగాడు అండీ రోడిక్ కైవసం చేసుకున్నాడు.

‘టైగర్’ వచ్చేశాడు..

అగస్టా, ఏప్రిల్ 5: సుమారు నాలుగు నెలలు దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రపంచ మేటి గోల్ఫర్ టైగర్ ఉడ్స్ మళ్లీ మైదానంలోకి దిగాడు.అగస్టాలో ఈనెల 8 నుంచి ప్రారంభం కానున్న మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీలో ఆడనున్న అతను ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. గత ఏడాది నవంబర్ మాసంలో కారు ప్రమాదంలో గాయపడిన ఉడ్స్ ఆతర్వాత తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే.అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత తొలిసారి ఒక టీవీ చానెల్ ద్వారా మాట్లాడిన అతను తాను పొరపాటు చేశానని, తనను క్షమించాలని కోరాడు.

చైనా షట్లర్లంటే భయం లేదు

భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

April 5th, 2010

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: చైనా షట్లర్లంటే తనకు ఏమాత్రం భయం లేదని భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ స్పష్టం చేసింది. ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్న ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న ఆమె ఆదివారం పిటిఐతో మాట్లాడుతూ, ఈ టోర్నీకి చైనాతో సహా సుమారు 10 మంది మేటి క్రీడాకారిణులు గైర్హాజరవుతున్న విషయంపై స్పందిస్తూ, కొంత మంది లేనంత మాత్రాన పోటీ తక్కువగా ఉంటుందని అనుకోరాదని స్పష్టం చేసింది. హాంకాంగ్‌కు చెందిన జావొ మి తదితరులు గట్టిపోటీనిస్తారని ఆమె తెలిపింది. ఇటీవల కాలంలో చైనా క్రీడాకారిణులతో పలు టోర్నీల్లో పోటీపడ్డానని, కాబట్టి వారంటే తనకు ఇప్పుడు భయం లేదని చెప్పింది. ఈఏడాది జరిగే కామన్‌వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల్లో రాణిస్తానని ధీమా వ్యక్తం చేసింది. భారత్‌కు పతకాలను అందించడమే తన లక్ష్యమని సైనా తెలిపింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పింది.

మలేసియా ఫార్ములా వన్ విజేత వెటల్

April 5th, 2010

సెపాంగ్, మలేసియా, ఏప్రిల్ 4: మలేసియా గ్రాండ్‌ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ కైవసం చేసుకున్నాడు.

షోయబ్-ఆయేషా కేసు

అజ్జూకు తెలుసు!

April 5th, 2010

హైదరాబాద్, ఏప్రిల్ 4: పాకిస్తాన్ క్రి కెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చే సుకున్నానని, అతనితో హైదరాబాద్‌లో ని తాజ్ రెసిడెన్సీ హోటల్‌లో గడిపా నని అంటున్న ఆయేషా సిద్ధిఖీ చేస్తున్న వాదన నిజమేనా?

ఆయేషాకే పాక్ మద్దతు!

April 5th, 2010

వెల్లింగ్టన్, ఏప్రిల్ 4: రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠను సృష్టిస్తున్న పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహ వ్యవహారంలో పాక్ ప్రజలు ఆయేషా సిద్ధిఖీకి మద్దతునిస్తున్నారు.

మలేసియా క్వాలిఫయర్‌లో వెబర్ టాప్

April 4th, 2010

సెపాంగ్, ఏప్రిల్ 3: మలేసియా గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్ క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో రెడ్‌బుల్ డ్రైవర్ మార్క్ వెబర్ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు.

సానియా ఇంట్లో షోయబ్ ప్రత్యక్షం!

April 4th, 2010

హైదరాబాద్, ఏప్రిల్ 3: వివాదాస్పద పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ హఠాత్తుగా హైదరాబాద్‌లోలో ప్రత్యక్షమయ్యాడు.

తల్లితో సానియా వాగ్వాదం?

April 4th, 2010

హైదరాబాద్, ఏప్రిల్ 3: పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను తమ కుమార్తె వివాహం చేసుకోవడం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తల్లిదండ్రులకు ఇష్టం లేదా?

ఆనందహేల

April 1st, 2010

ఫ్లోరిడాలోని కీబిస్కేన్‌లో జరుగుతున్న సోనీ ఎరిక్‌సన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన సీడెడ్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్‌ను 6-4, 6-7(3) సెట్ల తేడాతో ఓడించిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారుడు తొమాస్ బెర్డిచ్ ఆనందహేల

అక్కడ బ్రహ్మరథంఇక్కడ నిరసన స్వరం..

అంతటా సానియా స్మరణే!

April 2nd, 2010

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సానియా, మాలిక్‌ల పెళ్లి వ్యవహారానికి పాకిస్తాన్ మీడియా విస్తృత ప్రచారం కల్పించి బ్రహ్మరథం పడుతోండగా, భారత్‌లో మాత్రం నిరసన వ్యక్తమవుతోంది.

సత్తా చాటుతా

మలేసియా రేస్‌పై కరుణ్ ఆశ

April 2nd, 2010


కౌలాలంపూర్, ఏప్రిల్ 1: భారత తొలి ఫార్ములా వన్ రేసర్ కరుణ్ చందోక్ బహ్రెయిన్ రేసులో విఫలమైనప్పటికీ, ఆస్ట్రేలియాలో 14వ స్థానాన్ని సంపాదించి సంచలనం సృష్టించాడు.

ఉడ్స్ ‘కీర్తి కిరీటం’లో మరో ‘కలికితురాయి’

‘అన్ సెక్సీయెస్ట్ మ్యాన్’ టైటిల్ స్వంతం

April 3rd, 2010

వాషింగ్టన్, ఏప్రిల్ 2: అక్రమ సంబంధాలు నెరపడం ద్వారా వైవాహిక జీవితంలోకి కొనితెచ్చుకున్న సమస్యలతో సతమతమవుతున్న ప్రపంచ మేటి గోల్ఫర్ టైగర్ ఉడ్స్ మరో ‘ఘనత’ను సాధించాడు. ఆయన ఈ ఏడాది ప్రపంచంలోనే ‘అన్ సెక్సీయస్ట్ మ్యాన్’గా నిలిచాడు. ‘ది బోస్టన్ ఫీనిక్స్’ వార్తా పత్రిక ఆయనకు ఈ ‘కిరీటాన్ని’ తొడిగింది. గోల్ఫ్ క్రీడలో టైటిళ్ల మీద టైటిళ్లు సాధించి ప్రపంచ మేటి గోల్ఫర్‌గా నిలిచిన టైగర్ ఉడ్స్ ఆ పత్రిక నిర్వహించిన ఒక సర్వేలో 99 మంది ఇతరులను తలదన్ని ఈ ‘టైటిల్’ను కూడా స్వంతం చేసుకున్నాడు. పడతులతో డబుల్ గేమ్స్ ఆడటంలోనూ అత్యంత ‘ప్రతిభ’ చూపిన ఉడ్స్ ఈ ‘టైటిల్’కు అన్నివిధాలా అర్హుడని రాడార్ ఆన్‌లైన్ డాట్‌కామ్‌తో ఆ పత్రిక ప్రధాన సంపాదకుడు లాన్స్ గ్లౌడ్ పేర్కొన్నాడు.

April 3rd, 2010

కౌలాలంపూర్, ఏప్రిల్ 2 : మలేసియా గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను వర్షం బెడద వెంటాడుతోంది. ఆదివారం రేస్ జరగనుండగా, శుక్రవారం నుంచే భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీనితో రేస్‌ను సాయంత్రం ఐదు నుంచి నాలుగు గంటలకు మార్చారు. మలేసియాలో సహజంగా సాయంత్రాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకొని వర్షం కురుస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రేస్‌ను నిర్ణీత సమయానికి ముందుగానే ప్రారంభించాలని నిర్వహకులు నిర్ణయించారు. గతవారం ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రీ జరిగినప్పుడు చిరుజల్లులు కురిసినా రేస్ ఎలాంటి ఆటంకం లేకుండా ముగిసింది. అయితే, రీ-్ఫ్యయలింగ్ నిబంధనను తొలగించడంతో, ఇప్పుడు భారీగా ఇంథనాన్ని నింపుకొని డ్రైవర్లు బరిలోకి దిగాల్సి ఉంటుంది. భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఎలావుంటుందో ఇంకా డ్రైవర్లకు అనుభవంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో రేస్ సజావుగా సాగుతుందా అన్న అనుమానం తలెత్తుతోంది.

ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రీలో విఫలమైనప్పటికీ, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండొ అలాన్సొ మొత్తం 37 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, అదే జట్టుకు చెందిన ఫెలిప్ మస్సా 33 పాయింట్లతో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించాడు. వీరిని అధిగమించి ముందుకు దూసుకెళ్లడానికి ప్రపంచ చాంపియన్, ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ విజేత జెన్సన్ బెటన్ సిద్ధంగా ఉన్నాడు. బటన్‌తోపాటు మెక్‌లారెన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లూయిస్ హామిల్టన్ కూడా గట్టిపోటీనిస్తాడనేది వాస్తవం. గతంలో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకొని రికార్డు సృష్టించిన మైకెల్ షూమాకర్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత మళ్లీ మనసు మార్చుకొని ఈఏడాది బహ్రెయిన్, ఆస్ట్రేలియా రేసుల్లో పాల్గొన్నాడు. అయితే, అతను ఈ రెండు పోటీల్లోనూ తన స్థాయికి తగిన నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోయాడు. మలేసియాలో అతని ఏ విధంగా రాణిస్తాడో చూడాలి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: