Surfingall

Get Go Entertain Enjoy Energy

Cricket

Posted by surfingall on April 2, 2010

ముంబయకి చెన్నై షాక్

చెన్నై, ఏప్రిల్ 6: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపి ఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణిస్తున్న ముంబయ ఇండియన్స్‌కు చెన్నై సూపర్ కిం గ్స్ షాకిచ్చింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 165 పరుగులు సాధించ గా, అందుకు సమాధానంగా ముంబయ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులకు పరిమితమైంది.
ఓపెనర్ మాథ్యూ హేడెన్ (35), కెప్టెన్ మహేంద్ర సిం గ్ ధోనీ (31), బద్రీనాథ్ (30 నాటౌట్) రాణించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓ వర్లలో నాలుగు వికెట్లకు 165 పరుగులు చేసింది.
ఛేదించాల్సింది భారీ లక్ష్యం కాకపోవడంతో, ముం బయ ఇండియన్స్ తాపీగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. శిఖర్ ధావన్ 16 పరుగులు చేసి తుషార బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో 46 పరుగుల స్కోరువద్ద తొలి వికెట్ కోల్పోయంది. అయతే, మరో ఓపెనర్, జట్టు కెప్టెన్ సచి న్ తెండూల్కర్ మరోసారి తన అద్భుత ఫామ్‌ను కొన సాగించడంతో ముంబయ పరుగుల వేట కొనసాగిం ది. అయతే, మితిమీరిన లక్షణాత్మక విధానాన్ని అనుస రించడంతో ముంబయ జట్టు సాధించాల్సిన రన్‌రేట్ క్రమంగా పెరిగింది. 38 పరుగులు చేసిన సచిన్ రిటైర్డ్ హర్ట్‌కాగా, అంబటి రాయుడు (3), బ్రేవో (2) ఒకరి త ర్వాత మరొకరు పెవిలియ చేరారు. దీనితో మిగతా బ్యా ట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది. సౌరభ్ తివారీ 14 పరుగు లు చేసి వెనుదిరగ్గా, 82 పరుగుల వద్ద ముంబయ నాలుగో వికెట్ కోల్పోయంది. మరో నాలుగు పరుగుల తర్వాత పొలార్డ్ (5) అవుటయ్యాడు. సతీష్ (4), మెక్‌లారెన్ (1) అవుట్‌కావడంతో సచిన్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. కానీ, అతను ఎ క్కువ సేపు నిలవలేక 45 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద తుషార బౌలింగ్‌లో విజయ్‌కి చిక్కాడు. చివరిలో హర్భ జన్ సింగ్ 33 పరుగులు చేసినప్పటికీ, ఫలితం లేక పోయంది. చెన్నై సూపర్ కింగ్స్ 24 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది.

ఐపిఎల్‌లో నేడు

రాజస్థాన్ రాయల్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్
(జైపూర్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో సాయంత్రం 4.00 నుంచి)
కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ డేర్ డెవిల్స్
(కోల్‌కతా ఈడెన్ గార్డెన్ స్టేడియంలో రాత్రి 8.00 గంటల నుంచి)

కాపీ కొడుతూ పట్టుబడ్డాడు!

April 7th, 2010

ఇస్లామాబాద్, ఏప్రిల్ 6: తొమ్మితో తరగతి ఇంగ్లీషు పరీక్షలో కాపీకొడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన పాకిస్తాన్ యువ సంచలన క్రికెటర్ నాసిర్ జంషెడ్‌ను లాహోర్ పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.

రోహిత్ శ్రమ వృథా

ఉత్కంఠ పోరులో చార్జర్స్‌పై రాజస్థాన్ విజయం

నాగపూర్, ఏప్రిల్ 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన డే నైట్ మ్యాచ్‌లో రాజ స్థాన్ రాయల్స్ రెండు పరుగుల తేడాతో గెలుపొందింది. 160 పరుగుల విజ య లక్ష్యాన్ని అందుకునే దిశగా చార్జర్స్ ఆటగాడు రోహిత్ శర్మ చేసిన ఒంటరి పోరాటం వృథా అయంది.
కట్టడి చేసిన చార్జర్స్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్‌ను డక్కన్ చార్జర్స్ బౌలర్లు ప్రారంభం నుంచే కట్టడి చేశారు. హారిస్ వేసిన తొలి ఓవర్‌లోనే రిటర్న్ క్యాచ్ ప్రమాదం నుంచి తప్పించుకున్న లంబ్ (15) జట్టు స్కోరు 16 పరుగుల వద్ద ఆర్పీ సింగ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రిటర్న్ క్యాచ్ పట్టడంలో విఫలమైన హారిస్ ఈసారి ఎలాంటి పొరపాటు చేయలేదు. ఆతర్వాత రెండో బంతికే నామన్ ఒజా (1) కూడా హారిస్‌కే క్యాచ్ అందించి వెనుదిరిగాడు. ఒకే ఓవర్‌లో ఆర్పీ సింగ్ ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్‌కు పంపడంతో రాజస్థాన్ ఒత్తిడికి గురైంది. ఈ దశలో ఫజల్, వాట్సన్ జట్టును ఆదుకునే బాధ్యతను స్వీకరించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. 36 పరుగులు చేసిన ఫజల్ జట్టు స్కోరు 94 పరుగుల వద్ద ప్రజ్ఞాన్ ఒజా బౌలింగ్‌లో బిలాకియాకు చిక్కాడు. యూసుఫ్ పఠాన్ (5), అభిషేక్ ఝున్‌ఝన్‌వాలా (11), అభిషేక్ రాత్ (0) ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాగా, క్రీజ్‌లో ఉన్నంత సేపూ రాజస్థాన్‌కు భారీ స్కోరును సాధించిపెట్టే రీతిలో ఆడిన వాట్సన్ 36 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 58 పరుగులు చేసి ఆర్పీ సింగ్ బౌలింగ్‌లో అనిరుద్ధ్ సింగ్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. షేన్ వార్న్ ఒక పరుగు చేసి రనౌట్‌కాగా, ఆదిత్య డోలే (4), సిద్దార్థ్ త్రివేది (9) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. 19.5 ఓవర్లలో రాజస్థాన్ 159 పరుగులకు ఆలౌట్‌కాగా, మోర్కెల్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆర్పీ సింగ్ నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చడం విశేషం. అతని బౌలింగ్ ప్రతిభతో రాజస్థాన్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
కెప్టెన్ ఆడం గిల్‌క్రిస్ట్‌తో కలిసి 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో కి దిగిన వివిఎస్ లక్ష్మణ్ కేవలం ఆరు పరుగులు చేసి డోలే బౌలింగ్‌లో యూ సుఫ్ పఠాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో చార్జర్స్ 26 పరుగుల స్కోరువద్ద తొలి వికెట్ కోల్పోయంది. ధాటిగా ఆడిన గిల్‌క్రిస్ట్ 17 బంతుల్లో మూడు ఫో ర్లు, మరో మూడు సిక్సర్లతో 34 పరుగులు చేసి డోలే బౌలింగ్‌లోనే లంబ్ క్యా చ్ అందుకోగా వెనుదిరిగాడు. అప్పటికి చార్జర్స్ స్కోరు 47 పరుగులు. సైమం డ్స్, రోహిత్ శర్మ వ్యూహాత్మకంగా పరుగులు రాబడుతూ స్కోరును ముందు కు తీసుకెళ్లారు. జట్టు స్కోరు 86 పరుగుల వద్ద త్రివేది బౌలింగ్‌లో ఫజల్‌కు క్యాచ్ ఇచ్చిన సైమండ్స్ 20 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయతే, రన్‌రేట్ తగ్గకుండా జాగ్రత్త పడిన రోహిత్ శర్మ, అనిరుద్ధ్ సింగ్ 12వ ఓవర్‌లో స్కోరును 100 పరుగుల మైలురాయ దాటించారు. తొమ్మిది పరుగులు చేసిన అనిరుద్ధ్ సింగ్ జట్టు స్కోరు 112 పరు గుల వద్ద వికెట్‌కీపర్ నామన్ ఒజాకు క్యాచ్ ఇచ్చి షేన్ వార్న్ బౌ లింగ్‌లో వెనుదిరిగాడు. చార్జర్స్ నాలుగో వికెట్ కోల్పోయంది. ఒక వైపు వికెట్లు కూలుతున్నా క్రీజ్‌లో నిలదొక్కుకున్న రోహిత్ శర్మ జట్టును విజయపథంలో నడిపించేందుకు చక్కటి ఆటతో అల రించాడు. హార్డ్ హిట్టర్‌గా పేరు సంపాదించిన డ్వేన్ స్మిత్ దారుణం గా విఫలమై, కేవలం నాలుగు పరుగులు చేసి వార్న్ బౌలింగ్‌లో త్రివేదికి దొరకిపోయాడు. 120 పరుగుల వద్ద చార్జర్స్ ఐదో వికెట్ చేజార్చుకుంది. అజర్ బిలాకియా రెండు పరుగులకే వార్న్ బౌలిం గ్‌లో రాత్‌కు క్యాచ్ ఇవ్వగా, అదే ఓవర్‌లో హారిస్ క్లీన్ బౌల్డ్ అ య్యాడు. వార్న్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి నాలుగు వికె ట్లు పడగొట్టి, రాజస్థాన్‌కు విజయంపై ఆశలు రేకెత్తించాడు. విజయానికి చార్జర్స్ చివరి రెండు ఓవర్లలో చార్జర్స్ 19 పరుగుల దూరంలో నిలిచింది. మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్‌తో రాణించడంతో, చివరి ఓవర్ లో ఆరు పరుగులు చేయాల్సి వచ్చింది. అయతే, త్రివేది వేసిన ఆ ఓవర్ మూ డో బంతికి ఆర్పీ సింగ్ అవుట్‌కాగా, చివరి మూడు బంతుల్లో చార్జర్స్ విజయా నికి నాలుగు పరుగుల దూరంలో నిలిచింది. పరుగుల వేటలో విఫలమైన హర్మీత్ సింగ్ సున్నాకే రనౌట్‌కాగా, ఆతర్వాతి బంతికే రోహిత్ శర్మ అవుట య్యాడు. 44 బంతులు ఎదుర్కొని ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 పరు గులు సాధించి, జట్టును విజయానికి సమీపంలోకి తెచ్చినప్పటికీ, రోహిత్ శర్మ పోరాటం వృథా అయంది. 157 పరుగుల వద్ద చార్జర్స్ ఆలౌటైంది. రాజస్థాన్ రెండు పరుగుల తేడాతో గెలిచింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చార్జర్స్ ఓటమిని కొనితెచ్చుకుంది.
సంక్షిప్తంగా స్కోర్లు
రాజస్థాన్ రాయల్స్: 19.5 ఓవర్లలో ఆలౌట్ 159 (ఫజల్ 36, వాట్సన్ 58, ఆర్పీ సింగ్ 3/17, హారిస్ 2/34, హర్మీత్ సింగ్ 2/25).
డక్కన్ చార్జర్స్: 19.5 ఓవర్లలో ఆలౌట్ 157 (రోహిత్ శర్మ 73, గిల్‌క్రిస్ట్ 34, వార్న్ 4/21).

ఐపిఎల్‌లో నేడు

చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబయ ఇండియన్స్
(
చెన్నై చిదంబరం స్టేడియంలో రాత్రి 8.00 గంటల నుంచి)

లాయర్ని కలవను..కోర్టుకు వెళ్లను..

స్పష్టం చేసిన పాక్ కెప్టెన్ అఫ్రిదీ

April 6th, 2010

లాహోర్, ఏప్రిల్ 5: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) తమపై విధించిన నిషేధాలు, జరిమానాలపై కొంతమంది క్రికెటర్లు కోర్టును ఆశ్రయిస్తుండగా, తాను మాత్రం అలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదని ఆల్‌రౌండర్ షహీద్ అఫ్రిదీ స్పష్టం చేశాడు.

జయవర్ధనే సెంచరీ

నైట్ రైడర్స్‌పై ‘కింగ్స్’ ఘన విజయం

April 5th, 2010

కోల్‌కతా, ఏప్రిల్ 4: ఓపెనర్ మహేల జయవర్ధనే సూపర్ సెంచరీతో కదం తొక్కి, ఆదివారం ఇక్కడ జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు కోల్‌కత నైట్ రైడర్స్‌పై ఘన విజయాన్ని అందించాడు.

‘రాయల్’పై ఢిల్లీ గెలుపు

April 5th, 2010

ఢిల్లీ, ఏప్రిల్ 4: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం ఫిరో జ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగ ళూరును ఢిల్లీ డేర్ డెవిల్స్ చిత్తు చేసింది.

ఐపిఎల్‌లో నేడు

April 5th, 2010

డక్కన్ చార్జర్స్ vs రాజస్థాన్ రాయల్స్ (నాగపూర్‌లో రాత్రి 8.00 గంటల నుంచి)

విజయ్ విజృంభణ…

రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో 127 పరుగులతో కదంతొక్కిన చైనె్న సూపర్ కింగ్స్ ఓపెనర్ మురళీ విజయ్.

దూసుకెళుతున్న ముంబయ

April 4th, 2010

ముంబయ, ఏప్రిల్ 3: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపి ఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో సచిన్ తెండూల్కర్ కెప్టెన్సీలోని ముంబయ ఇండియన్స్ దూసుకెళుతోంది.

సచిన్‌కు కాన్పూర్ కానుక

April 3rd, 2010

కాన్పూర్, ఏప్రిల్ 2: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ బ్యాటింగ్ తీరుకు ముగ్ధులైన కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ వారు అతనికి ఓ అరుదైన గౌరవాన్ని కల్పించారు.

ఉడ్స్ ‘కీర్తి కిరీటం’లో మరో ‘కలికితురాయి’

ఐసిసి వరల్డ్ కప్ వ్రీక్షకులకు మల్టిపుల్ వీసాలు

April 3rd, 2010

కొలంబో, ఏప్రిల్ 2: వచ్చే ఏడాది జరిగే ఐసిసి ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లను తిలకించేందుకు భారత్‌కు వచ్చే అభిమానులకు (పాకిస్తాన్ నుండి వచ్చే వారికి మినహా) మల్టిపుల్ ఎంట్రీ వీసాలను జారీ చేసే విషయంపై ఐసిసి.

‘కింగ్స్ ఎలెవెన్’ పై ‘చాలెంజర్స్’ విజయం

April 3rd, 2010

మొహాలీ, ఏప్రిల్ 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా శుక్రవారం ఇక్కడి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో లోకల్ జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ జట్టు 19.1 ఓవర్లలో 184 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని అధిగమించింది. కెవిన్ పీటర్సన్, విరాట్ కొహ్లిలు చక్కగా రాణించి రాయల్ చాలెంజర్స్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఓటమితో కింగ్స్ ఎలెవెన్ ఆశలు ఆవిరయ్యాయ.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను మార్ష్, బిస్లా ప్రారంభించారు. జట్టు స్కోరు 3 పరుగుల వద్ద ఉండగానే మార్ష్ (2) వినయ్ కుమార్ బౌలింగ్‌లో రాహుల్ ద్రవిడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ కుమార సంగక్కర బిస్లాతో కలిసి బాధ్యతాయుతంగా ఆడటంతో రెండో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. జట్టు స్కోరు 66 పరుగుల వద్ద ఉండగా బిస్లా (28) అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ రూపంలో వెనుదిరిగాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన రవి బొపార సంగక్కరకు చక్కటి సహకారం అందించడంతో స్కోరు వేగం పెరిగింది. 27 బంతులను ఎదుర్కొని 8 ఫోర్లతో 45 పరుగుల స్కోరు చేసిన సంగక్కర జట్టు స్కోరు 84 పరుగుల వద్ద ఉండగా స్టెయిన్ బౌలింగ్‌లో కాలిస్‌కు దొరికిపోయాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మాజీ కెప్టెన్ యువరాజ్ సింగ్ కొద్దిసేపు మెరుపులు మెరిపించాడు. దీంతో నాలుగో వికెట్‌కు బొపార, యువరాజ్‌లు కలిసి 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగలిగారు. చూడచక్కటి షాట్లతో అలరించిన యువరాజ్ సింగ్ 20 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 36 పరుగుల స్కోరు చేసి కాలిస్ బౌలింగ్‌లో వైట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 149 పరుగుల స్కోరు వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇర్ఫాన్ పఠాన్ కేవలం ఐదు బంతుల్లో ఒక సిక్సర్, రెండు ఫోర్లతో 16 పరుగులు సాధించి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ జట్టు 181 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అనంతరం 182 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ జట్టు 28 పరుగుల స్కోరు వద్దే జాక్ కాలిస్ (9) వికెట్‌ను, ఆ తర్వాత మరికొద్ది సేపటికే మనీష్‌కుమార్ పాండే (29) వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో కెవిన్ పీటర్సన్, విరాట్ కొహ్లీలు చక్కగా రాణించి తమ జట్టును ఆదుకున్నారు. వీరిరువురూ కలిసి మూడో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన అనంతరం జట్టు స్కోరు 130 పరుగుల వద్ద ఉండగా బిపుల్ శర్మ బౌలింగ్‌లో ఇర్ఫాన్ పఠాన్‌కు క్యాచ్ ఇచ్చి కొహ్లీ (42) నిష్క్రమించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాబిన్ ఉతప్ప కొద్దిసేపే క్రీజ్‌లో ఉన్నా 8 బంతులను ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సహాయంతో 22 పరుగులు చేసి పఠాన్ బౌలింగ్‌లో బిస్లాకు దొరికిపోయాడు. దీంతో నాలుగో వికెట్‌కు మరో 40 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఉతప్ప అవుటైన అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైట్ (6-నాటౌట్) సహకారంతో కెవిన్ పీటర్సన్ రాయల్ చాలెంజర్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. 44 బంతులను ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 66 పరుగులు చేసిన పీటర్సన్‌ను ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.
సంక్షిప్తంగా స్కోర్లు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ : 20 ఓవర్లలో 181/5 (కుమార సంగక్కర 45, రవి బొపార 42-నాటౌట్, యువరాజ్ సింగ్ 36, ఎంఎస్ బిస్లా 28)
బౌలింగ్ : వినయ్ కుమార్ 1/24, స్టెయిన్ 1/31, అనిల్ కుంబ్లే 1/33, జాక్ కాలిస్ 1/45.
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు : 19.1 ఓవర్లలో 184/4 (కెవిన్ పీటర్సన్ 66-నాటౌట్, విరాట్ కొహ్లీ 42, మనీష్‌కుమార్ పాండే 29, రాబిన్ ఉతప్ప 22)
బౌలింగ్ : శ్రీవాస్తవ 1/21, బిపుల్ శర్మ 1/26, ఇర్ఫాన్ పఠాన్ 1/36.
————————-

ఐపిఎల్‌లో నేడు
—————————-
చెన్నై సూపర్ కింగ్స్
vs
రాజస్థాన్ రాయల్స్
(చెన్నైలో సాయంత్రం 4 గంటల నుంచి)
* * *
ముంబయి ఇండియన్స్
vs
డక్కన్ చార్జర్స్
(ముంబయిలో రాత్రి 8 గంటల నుంచి)
———————————–

పాయింట్ల పట్టిక
———————————–
జట్టు మ్యాచ్‌లు గెలిచినవి ఓడినవి పాయింట్లు
ముంబయి ఇండియన్స్ 7 6 1 12
రాయల్ చాలెంజర్స్ 8 5 3 10
ఢిల్లీ డేర్ డెవిల్స్ 8 5 3 10
రాజస్థాన్ రాయల్స్ 8 4 4 8
కోల్‌కతా నైట్ రైడర్స్ 8 4 4 8
చెన్నై సూపర్ కింగ్స్ 8 3 5 6
డక్కన్ చార్జర్స్ 7 3 4 6
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 8 1 7 2

(ఈ టోర్నమెంట్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు )

ప్రాక్టీస్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనున్న మ్యాచ్‌లో తలపడేందుకు బుధవారం నెట్ ప్రాక్టీస్‌కు హాజరైన డిఫెండింగ్ చాంపియన్ డక్కన్ చార్జర్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు

‘చాలెంజర్స్’ పై ‘సూపర్’ విక్టరీ

చెన్నై, మార్చి 31: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా బుధవారం ఇక్కడి చిదంబరం స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో జరిగిన ట్వంటీ-20 లీగ్ మ్యాచ్‌లో లోకల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వి

‘డెవిల్స్’చేతిలో ‘రాయల్స్’చిత్తు

న్యూఢిల్లీ, మార్చి 31: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా బుధవారం ఇక్కడి ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై లోకల్ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ 67 పరుగుల భారీ ఆధ

“సానియాకు ‘గిల్లీ’ శుభాకాంక్షలు”

కోల్‌కతా, మార్చి 31: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ను వివాహమాడనునన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు డక్కన్ చార్జర్స్ కెప్టెన్ ఆడం గిల్‌క్రిస్ట్ శుభాకాంక్షలు తెలిపాడు.

తప్పులను దిద్దుకుంటాం: ‘గిల్లీ’

ఈడెన్‌లో నేడు ‘రైడర్స్’తో ‘చార్జర్స్’ పోరు

కోల్‌కతా, మార్చి 31: బ్యాటింగ్‌లో స్థిమితంగా రాణించలేకపోవడమే తమ జట్టు అపజయాలకు కారణమని డిఫెండింగ్ చాంపియన్ డక్కన్ చార్జర్స్ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.

సెవాగ్‌కు బిసిసిఐ షాక్

నో అబ్జెక్షన్ సర్ట్ఫికెట్‌ను రద్దు

లండన్, మార్చి 31: ఇంగ్లీష్ కౌంటీ మ్యాచ్‌లలో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న భారత స్టార్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెవాగ్‌కు, ఇతర భారత క్రికెటర్లకు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్ట్ఫికెట్‌ను (నిరభ్యంతర పత్రాన్ని)

రైడర్స్‌ను గెలిపించిన గంగూలీ

April 2nd, 2010

కోల్‌కతా, ఏప్రిల్ 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ డక్కన్ చార్జర్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 24 పరుగుల తేడాతో గెలుపు .

ఐపిఎల్ నుండి రూ. 150 కోట్లు

పన్నుల రూపంలో వసూలు చేయాలని ప్రభుత్వ యోచన

April 2nd, 2010

న్యూఢిల్లీ ఏప్రిల్ 1 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నుండి దాదాపు రూ. 150 కోట్లను ప్రత్యక్ష పన్నుల రూపంలో వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది

చీర్స్

గురువారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో దక్కన్ చార్జర్స్కోల్‌కతా నైట్ రైడర్స్ టీము సభ్యులకు చీర్స్ చెబుతున్న ప్రముఖ నటి సుస్మితాసేన్

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: